This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

"మంత్రం" అనే పదం సంస్కృతంలోంచి ఉద్భవించింది. "మన్" అనగా 'చింతన చేయడం', "త్ర" అనగా ఉపకరణాలు, అందుచేత ‘చింతన సాధనం’ అని శాబ్ధిక అనువాదం చేస్తారు.

అన్ని మంత్రాలకు ఆధారమైన “ప్రణవ మంత్రం” గా పిలవబడే "ఓం" మంత్రాలన్నిటిలో ముఖ్య మంత్రం. చాలామటుకు మంత్రాలను రెండు పంక్తులలో రాసే లేఖన శైలి అయిన “శ్లోకాల”లో రాస్తారు.

మంత్రాలు అతి శక్తివంతమైన శబ్ధాలు. ఇవి పఠించిన వారికి గొప్ప సానుకూల ప్రభావాలు కలుగును. ఆ మంత్రాలను పదే పదే పఠించడాన్ని "జపం" అని అంటారు. ప్రతీ మంత్రంలో గొప్ప అర్థం ఉంటుంది. అత్యంత భక్తితో ఈ మంత్రాలను పఠించినచో గొప్ప విముక్తి మార్గం లభించును - అది "శాశ్వతమైన ఆనందం".

ఈ శ్లోకాలు మానవులు సృష్ఠించినవికావు. మహాఋషులచే భగవంతుడు చెప్పించినవి. ప్రతి పదంలో ఒక శక్తి ఉంది.

మంత్రజపం ద్వారా త్వరగా మనశ్శాంతిని పొందవచ్చును – “ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప”.

 • గణపతి ప్రార్థన

  "శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
  ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
  అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం
  అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే"

  ఓం వక్రతుండ మహాకాయ కోఠి సూర్య సమ ప్రభ
  నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా

  " ఓం మహా గణపతయే నమః "

 • మాలధారణ మంత్రము

  జ్ఞాన ముద్రాం శాస్తృ ముద్రాం గురుముద్రాం నమామ్యహం!
  వనముద్రాం శుద్ధ ముద్రాం రుద్ర ముద్రాం నమామ్యహం!
  శాంత ముద్రాం సత్య ముద్రాం వ్రత ముద్రాం నమామ్యహం!
  శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపిమే.
  గురుదక్షిణా పూర్వం తస్యానుగ్రహ కారిణే!
  శరణాగత ముద్రాఖ్యాం త్వన్ముద్రాం నమామ్యహం!
  శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమో నమః!
  అష్టాదశం మహాసారం శాస్తృ దర్శన కారణం!
  విధితం శుద్ధ ముతృష్టం సన్నిధానం నమామ్యహం!
  ఊరుజం వాపురం చైవ భైరవద్వన్న సేవితం!
  విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం!!

  ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

 • అయ్యప్ప ప్రార్థన

  "అఖిల భువనదీపం - భక్తచిత్తాబ్ద సూనం
  సురగర మునీ సేవ్యం - తత్వమస్యాది లక్ష్యం
  హరి హర సుతమీషం - తారక బ్రహ్మ రూపం
  శబరిగిరి నివాసం - భావయే భూతనాథం!!!"

  శ్రీ గురుభ్యోనమః
  గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
  గురుసాక్షాత్ పరంబ్రహ్మః తస్మైశ్రీ గురువే నమః
  అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
  చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః
  స్వామియే శరణం అయ్యప్ప!!!

 • అయ్యప్ప శ్లోకం

  1. నమస్తే సర్వశక్తాయ నిత్యాయ పరమాత్మనే!
  పురుషాయాది బీజాయ | పరేశాయ నమోనమః!!

  2. తస్మై నమోభగవతే| నిర్వాణ సుఖదాయినే
  సర్వపాప హారయ పాపాయనంద మూర్తయే!!

  3. భూరికారుణ్య యుక్తాయ నిత్యాయ పరమాత్మనే|
  క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వధారాయ సాక్షిణే !!

  4. ఆనంద రూపిణిం శాంతం ఘోర సంసారతారకం |
  సృష్టి స్థిత్యస్త రూపాంతం శాస్తారం ప్రణతోస్మ్యహం !!

  5. నమఃపరాయ గోప్ర్తేస్తు తారక బ్రహ్మరూపిణే
  ఆర్యనాదాయ దేవాయ భూతనాధాయతే నమః
  ధ్యాయేత్ చారుజడాని బద్దమకుటం
  దివ్యాంబరం జ్ఞానము
  ద్రోద్యక్షకరం ప్రసన్న వదనం జానుస్థ హస్తేతరం
  మేఘశ్యామల కోమలం సురనుతం
  శ్రీయోగ పట్టాకచితం
  విజ్ఞాన ప్రధమ ప్రమేయ సుఘమం
  శ్రీ భూతనాధం విభుం !!

 • అయ్యప్ప శరణు ఘోష

  • 1. ఓం స్వామియే శరణమయ్యప్ప
  • 2. హరిహరసుతనే శరణమయ్యప్ప
  • 3. ఆపద్భాందవనే శరణమయ్యప్ప
  • 4. అనాథ రక్షకనే శరణమయ్యప్ప
  • 5. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప
  • 6. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
  • 7. అయ్యప్పనే శరణమయ్యప్ప
  • 8. అరియంగావు అయ్యావే శరణమయ్యప్ప
  • 9. అచ్చన్‌కోవిల్ అరసే శరణమయ్యప్ప
  • 10. కుళత్తుపులై బాలకనే శరణమయ్యప్ప
  • 11. ఎరుమేలి శాస్తావే శరణమయ్యప్ప
  • 12. వావర్ స్వామియే శరణమయ్యప్ప
  • 13. కన్నిమూల మహాగణపతియే శరణమయ్యప్ప
  • 14. నాగరాజావే శరణమయ్యప్ప
  • 15. మాలికాపురత్తు లోకదేవిమాతావే శరణమయ్యప్ప
  • 16. కరుప్పు స్వామియే శరణమయ్యప్ప
  • 17. దేవిప్పవర్ కానందమూర్తియే శరణమయ్యప్ప
  • 18. కాశీవాసియే శరణమయ్యప్ప
  • 19. హరిద్వార్ నివాసియే శరణమయ్యప్ప
  • 20. శ్రీరంగ పట్టణ నివాసియే శరణమయ్యప్ప
  • 21. కురుప్పతూర్ వాసియే శరణమయ్యప్ప
  • 22. స్తంభాద్రి వాసియే శరణమయ్యప్ప
  • 23. సద్గురునాధనే శరణమయ్యప్ప
  • 24. విల్లాళివీరనే శరణమయ్యప్ప
  • 25. వీర మణికంఠనే శరణమయ్యప్ప
  • 26. ధర్మశాస్తావే శరణమయ్యప్ప
  • 27. శరణు ఘోష ప్రియనే శరణమయ్యప్ప
  • 28. కాంతిమలై వాసనే శరణమయ్యప్ప
  • 29. పొన్నంబలవాసనే శరణమయ్యప్ప
  • 30. పంబాశిశువే శరణమయ్యప్ప
  • 31. పందళ రాజకుమారనే శరణమయ్యప్ప
  • 32. వావరిన్ తోళనే శరణమయ్యప్ప
  • 33. మోహినీ సుతనే శరణమయ్యప్ప
  • 34. కణ్కండ దైవమే శరణమయ్యప్ప
  • 35. కలియుగ వరదనే శరణమయ్యప్ప
  • 36. సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప
  • 37. మహిషి మర్ధననే శరణమయ్యప్ప
  • 38. పూర్ణ పుష్కలనాధనే శరణమయ్యప్ప
  • 39. వన్‌పులి వాహననే శరణమయ్యప్ప
  • 40. భక్తవత్సలనే శరణమయ్యప్ప
  • 41. భూలోకనాధనే శరణమయ్యప్ప
  • 42. అయిందుమలై వాసనే శరణమయ్యప్ప
  • 43. శబరిగిరీశనే శరణమయ్యప్ప
  • 44. ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప
  • 45. అభిషేక ప్రియనే శరణమయ్యప్ప
  • 46. వేదప్పొరుళే శరణమయ్యప్ప
  • 47. నిత్య బ్రహ్మచారియే శరణమయ్యప్ప
  • 48. సర్వమంగళ దాయకనే శరణమయ్యప్ప
  • 49. వీరాధి వీరనే శరణమయ్యప్ప
  • 50. ఓంకారప్పొరుళే శరణమయ్యప్ప
  • 51. ఆనంద రూపనే శరణమయ్యప్ప
  • 52. భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప
  • 53. ఆశ్రితవత్సలనే శరణమయ్యప్ప
  • 54. భూతగణాధిపతియే శరణమయ్యప్ప
  • 55. శక్తి రూపనే శరణమయ్యప్ప
  • 56. శాంతమూర్తియే శరణమయ్యప్ప
  • 57. పదునెట్టాంబడిక్కి అధిపతియే శరణమయ్యప్ప
  • 58. ఉత్తమ పురుషనే శరణమయ్యప్ప
  • 59. ఋషికుల రక్షకనే శరణమయ్యప్ప
  • 60. వేదప్రియనే శరణమయ్యప్ప
  • 61. ఉత్తర నక్షత్ర జాతకనే శరణమయ్యప్ప
  • 62. తపోధననే శరణమయ్యప్ప
  • 63. యెంగళ్ కులదైవమే శరణమయ్యప్ప
  • 64. జగన్మోహననే శరణమయ్యప్ప
  • 65. మోహనరూపనే శరణమయ్యప్ప
  • 66. మాధవసుతనే శరణమయ్యప్ప
  • 67. యదుకుల వీరనే శరణమయ్యప్ప
  • 68. మామలై వాసనే శరణమయ్యప్ప
  • 69. షణ్ముఖ సోదరనే శరణమయ్యప్ప
  • 70. వేదాంత రూపనే శరణమయ్యప్ప
  • 71. శంకరసుతనే శరణమయ్యప్ప
  • 72. శత్రుసంహారనే శరణమయ్యప్ప
  • 73. సద్గుణ మూర్తియే శరణమయ్యప్ప
  • 74. పరాశక్తియే శరణమయ్యప్ప
  • 75. పరాత్పరనే శరణమయ్యప్ప
  • 76. పరంజ్యోతియే శరణమయ్యప్ప
  • 77. హోమప్రియనే శరణమయ్యప్ప
  • 78. గణపతి సోదరనే శరణమయ్యప్ప
  • 79. కట్టాలవిషరారం శరణమయ్యప్ప
  • 80. విష్ణుసుతనే శరణమయ్యప్ప
  • 81. సకలకళావల్లభనే శరణమయ్యప్ప
  • 82. లోకరక్షకనే శరణమయ్యప్ప
  • 83. అమిత గుణాకరనే శరణమయ్యప్ప
  • 84. అలంకారప్రియనే శరణమయ్యప్ప
  • 85. కన్నిమారై కార్పవనే శరణమయ్యప్ప
  • 86. భువనేశ్వరనే శరణమయ్యప్ప
  • 87. మాతా-పితా-గురు-దైవమే శరణమయ్యప్ప
  • 88. స్వామియిన్ పుంగావనమే శరణమయ్యప్ప
  • 89. అళుదానదియే శరణమయ్యప్ప
  • 90. అళుదామేడే శరణమయ్యప్ప
  • 91. కళ్ళిడం కుండ్రే శరణమయ్యప్ప
  • 92. కరిమలై ఏట్రమే శరణమయ్యప్ప
  • 93. కరిమలై ఎరక్కమే శరణమయ్యప్ప
  • 94. పెరియాన వట్టమే శరణమయ్యప్ప
  • 95. చెరియాన వట్టమే శరణమయ్యప్ప
  • 96. పంబానదియే శరణమయ్యప్ప
  • 97. పంబయిల్ విళక్కే శరణమయ్యప్ప
  • 98. నీలీమలై ఏట్రయే శరణమయ్యప్ప
  • 99. అప్పాచిమేడే శరణమయ్యప్ప
  • 100. శబరి పీఠయే శరణమయ్యప్ప
  • 101. శరంగుత్తి ఆళే శరణమయ్యప్ప
  • 102. భస్మకుళమే శరణమయ్యప్ప
  • 103. పదునెట్టాంబడియే శరణమయ్యప్ప
  • 104. నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప
  • 105. కర్పూర జ్యోతియే శరణమయ్యప్ప
  • 106. జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప
  • 107. మకర జ్యోతియే శరణమయ్యప్ప
  • 108. ఓం శ్రీ హరి హర సుతన్, ఆనందచిత్తన్, అయ్యన్, అయ్యప్పస్వామియే శరణమయ్యప్ప
 • అయ్యప్ప భజన

  • స్వామి శరణం - అయ్యప్ప శరణం
  • భగవాన్ శరణం - భగవతి శరణం
  • దేవన్ శరణం - దేవీ శరణం
  • దేవన్ పాదం - దేవీ పాదం
  • స్వామి పాదం - అయ్యప్ప పాదం
  • భగవానే - భగవతియే
  • ఈశ్వరనే - ఈశ్వరియే
  • దేవనే - దేవియే
  • శక్తనే - శక్తియే
  • స్వామియే - అయ్యప్పో
  • పల్లికట్టు - శబరిమలక్కు
  • ఇరుముడి కట్టు - శబరిమలక్కు
  • కట్టుంకట్టి - శబరిమలక్కు
  • కల్లుంమల్లుం - కాలికిమెత్తయ్య్
  • ఏందివిడయ్యా - తూక్కి విడయ్యా
  • దేహబలందా - పాదబలందా
  • యారైకాన- స్వామియైకాన
  • స్వామియే కండల్ - మోక్షంకిట్టు
  • స్వామిమారె - అయ్యప్పమారె
  • సెయ్యభిషేకం - స్వామిక్కే
  • కర్పూరదీపం - స్వామిక్కే
  • పాలభిషేకం - స్వామిక్కే
  • భస్మాభిషేకం - స్వామిక్కే
  • తేనభిషేకం - స్వామిక్కే
  • చందనభిషేకం - స్వామిక్కే
  • పూలభిషేకం - స్వామిక్కే
  • పన్నీరభిషేకం - స్వామిక్కే
  • పంబాశిశువే - అయ్యప్పా
  • కాననవాసా - అయ్యప్పా
  • శబరిగిరీశా - అయ్యప్పా
  • పందళరాజా - అయ్యప్పా
  • పంబావాసా - అయ్యప్పా
  • వణ్‌పులివాహన - అయ్యప్పా
  • సుందరరూపా - అయ్యప్పా
  • షణ్ముగసోదర - అయ్యప్పా
  • మోహినితనయా - అయ్యప్పా
  • గణేశసోదర - అయ్యప్పా
  • హరిహరతనయా - అయ్యప్పా
  • అనాధ రక్షక - అయ్యప్పా
  • సద్గురునాధా - అయ్యప్పా
 • క్షమాపణ

  "జ్ఞానముతోను,అజ్ఞానముతోను తెలిసీ తెలియక నేను చేయు సకల తప్పులను క్షమించి కాపాడవలయును. సత్యమగు అష్టాదశ సోపానములపై చిన్ముద్రదారిగా అమరియుండి కాశి, రామేశ్వరము, పాండ్య, మళయాళ దేశములను ఏకచ్ఛత్రాధిపత్యముగా పరిపాలించు ఓం శ్రీ హరిహర పుత్రుడు ఆనందచిత్తుడు అయ్యన్ అయ్యప్పస్వామి పాదారవిందములే శరణం, శరణం, అయ్యప్ప."

 • లోకవీరం మహా పూజ్యం

  లోకవీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం విభుం
  పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం
  స్వామియే శరణం అయ్యప్ప !!!

  విప్రపూజ్యంవిశ్వవంద్యం విష్ణు శంభో శివం సుతం
  క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం
  స్వామియే శరణం అయ్యప్ప !!!

  మత్తమాతంగగమనం కారున్యామృత పూరితం
  సర్వ విఘ్న హారం దేవం శాస్తారం ప్రణమామ్యహం
  స్వామియే శరణం అయ్యప్ప !!!

  అస్మత్ కులేస్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం
  అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం
  స్వామియే శరణం అయ్యప్ప !!!

  పాంద్యేశవంశతిలకం కేరలేకేళివిగ్రహం
  ఆర్తత్రాణవరందేవం శాస్తారం ప్రణమామ్యహం
  స్వామియే శరణం అయ్యప్ప !!!

  పంచ రత్నఖ్య మేతద్యో నిత్యం స్తోత్రం పటేన్నరః
  తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే
  స్వామియే శరణం అయ్యప్ప !!!

 • అయ్యప్ప హారతి

  జయ శబరీశ హరే స్వామి జయ శబరీశ హరే
  జయ జయ ఓం శ్రీధర శంభుకుమార హరే ఓం జయ శబరీశ హరే!!!

  కలియుగ దేవ జయా స్వామి కరుణాసాగరనే
  కలియుగ సతతం స్వామి కామిత దాయకనే ఓం జయ శబరీశ హరే!!!

  ఇహపర మొక్షధనే స్వామి ఇంగిత దాయకనే
  ఇహపర నినుకృప ఆర్తివినాశకనే ఓం జయ శబరీశ హరే!!!

  నారాయణ నారాయణ ఓం, నారాయణ నారాయణ ఓం
  నారాయణ నారాయణ ఓం, నారాయణ నారాయణ ఓం
  జయ జయ గురుదేవ, జయ జయ గురుదేవ, స్వామి జయ జయ గురుదేవ,
  జయ జయ ఓం శ్రీధర శంభుకుమార హరే ఓం జయ శబరీశ హరే!!!

 • భూతనాథ సదానంద

  భూతనాథ సదానంద సర్వ భూత దయాపర
  రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః
  స్వామియే శరణం అయ్యప్ప !!!

  శాంత మానస సంస్థితం భక్తౌశు పాప హన్తారం
  అయ్యప్పన్ ప్రణమామ్యహం స్వామియే శరణం అయ్యప్ప !!!

 • హరివరాసనం

  అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు.

  హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు.

  ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.
  1# హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
  అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా

  2# శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం నర్తనాలసం
  అరుణభాసురం భూతనాయకం - హరిహరాత్మజం దేవమాశ్రయే
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా

  3# ప్రణయసత్యకం ప్రాణనాయకం - ప్రణతకల్పకం సుప్రభాంచితం
  ప్రణవమందిరం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా

  4# తురగవాహనం సుందరాననం - వరగధాయుధం వేదవర్ణితం
  గురుకృపాకరం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా

  5# త్రిభువనార్చితం దేవతాత్మకం - త్రినయనం ప్రభుం దివ్యదేశికం
  త్రిదశపూజితం చింతితప్రదం - హరిహరాత్మజం దేవమాశ్రయే
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా

  6# భవభయాపహం భావుకావహం - భువనమోహనం భూతిభూషణం
  ధవళవాహనం దివ్యవారణం - హరిహరాత్మజం దేవమాశ్రయే
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా

  7# కళమృదుస్మితం సుందరాననం - కలభకోమలం గాత్రమోహనం
  కలభకేసరి వాజివాహనం - హరిహరాత్మజం దేవమాశ్రయే
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా

  8# శ్రితజనప్రియం చింతితప్రదం - శృతివిభూషణం సాధుజీవనం
  శృతిమనోహరం గీతలాలసం - హరిహరాత్మజం దేవమాశ్రయే
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా
  శరణమయ్యప్పా - స్వామి శరణమయ్యప్పా

వేదప్రియనే శరణమయ్యప్ప !

వీర మణికంఠనే శరణమయ్యప్ప !!

శరణు ఘోష ప్రియనే శరణమయ్యప్ప !!!

Comment