This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!
మా నిర్వహణలో జరగబోయే వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు, అన్నదానాలు, భజనలు, ఉత్సవముల వివరములను ఈ పుటలో ఎప్పటికప్పుడు అందించబడతాయి. శుభకరమగు ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని మంగళస్వరూపుడైన అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు.

ఈ కార్యక్రములలో పాల్గొనదలచిన భక్తులు మమ్ములను సంప్రదించగలరు.

అలాగే భక్తులు స్వతహాగా నిర్వహించే భజనలు, భిక్షలు తదితర పుణ్య కార్యక్రమముల గురించి మాకు తెలిపినచో అవి ఇతర భక్తుల సౌకర్యార్థము  ఇక్కడ అందించబడతాయి.

ఇట్లు - శ్రీ శాస్తా దేవస్థానము ట్రస్ట్, ఖమ్మం


14 జనవరి 2014 - మకర సంక్రాంతి - మకర జ్యోతి


14 జనవరి 2014 మంగళవారం న మకర జ్యోతిని ప్రతి సంవత్సరములాగానే ఆలయ ప్రాంగణములో వెలుగించబడును. ఆ జ్యోతి స్వరూపుని దర్శనమును చేసుకుని పునీతులవగలరని మా ప్రార్థన.
మకర జ్యోతియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపునే శరణమయ్యప్ప, ధర్మ శస్తావే శరణమయ్యప్ప.



16 నవంబర్ 2013 నుండి 26 డిసెంబర్ 2013 వరకు 28వ మండల పూజా మహోత్సవములు


ది. 16 నవంబర్ 2013 నుండి 26 డిసెంబర్ 2013 వరకు 28వ మండల పూజా మహోత్సవములు నిర్వహించబడును. మండలం అనగా 41 రోజులు. ఈ 41 యొక్క దినములు ఉదయము, సాయంత్రము ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి మరియు ప్రతి రోజు మధ్యాహ్నము అన్నదానము జరుపబడును. కావున భక్తులు ఈ పూజలో పాల్గొని అయ్యప్పకు ప్రీతి పాత్రులు కాగలరు. పూజా వివరములు (Click here) .

మరిన్ని వివరముల కొరకు మమ్ముల్ని సంప్రదించగలరు (Click Here).
ఇట్లు, శ్రీ శాస్తా దేవస్థానము ట్రస్ట్, ఖమ్మం.


21 జూన్ 2013 చక్రబ్జ పూజ (విష్ణు పూజ)


ది. 21 జూన్ 2013 చక్రబ్జ పూజ (విష్ణు పూజ) నిర్వహించబడును. కావున భక్తులు ఈ పూజలో పాల్గొని అయ్యప్పకు ప్రీతి పాత్రులు కాగలరు.

మరిన్ని వివరముల కొరకు మమ్ముల్ని సంప్రదించగలరు (Click Here). ఇట్లు, శ్రీ శాస్తా దేవస్థానము ట్రస్ట్, ఖమ్మం.


11 ఎప్రిల్ 2013 - 19 ఎప్రిల్ 2013 - బ్రహ్మోత్సవము మరియు సహస్ర కలశాభిషేకం


ది. 11-4-2013 గురువారం నుండి ది. 19-4-2013 శుక్రవారం వరకు 9 రోజులు టి.కె.దామోదరన్ తంత్రి బృందం మరియు ఆలయ ప్రధాన పూజారి శ్రీ పాకతిల్లం నారాయణన్ నంబూద్రి గార్లచే కేరళ సాంప్రదాయ ప్రకారం అత్యంత వైభవోపేతముగా భక్తుల మనోభిష్టములు నెరవేర్చు హోమములు మరియు పూజలు జరపబడును. అయ్యప్ప ఉత్సవ విగ్రహమను తొమ్మిది రోజులు ఊరేగిస్తారు. మరియు వేయి (సహస్ర) కలశలలో పవిత్ర నీరు ఉంచి, పూజలు నిర్వహించి అయ్యప్ప విగ్రహమునకు అభిషేకం జరుపబడును. ఆ పుణ్యమూర్తిని దర్శించి, ఆ పవిత్రమైన అభిషేక నీటిని స్వీకరించగలరని మా ప్రార్ధన.


14 జనవరి 2013 - మకర సంక్రాంతి - మకర జ్యోతి


14 జనవరి 2013 సోమవారం న మకర జ్యోతిని ప్రతి సంవత్సరములాగానే ఆలయ ప్రాంగణములో వెలుగించబడును. ఆ జ్యోతి స్వరూపుని దర్శనమును చేసుకుని పునీతులవగలరని మా ప్రార్థన.
మకర జ్యోతియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపునే శరణమయ్యప్ప, ధర్మ శస్తావే శరణమయ్యప్ప.



16 నవంబరు 2012 - 26 డిసెంబరు 2012 - మండలపూజా మహోత్సవములు


16 నవంబరు 2011 నుండి 26 డిసెంబరు 2011 వరకు మండలపూజా మహోత్సవములు నిర్వహించబడును. మండలం అనగా 41 రోజులు. ఈ 41 యొక్క దినములు ఉదయము, సాయంత్రము ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి మరియు ప్రతి రోజు మధ్యాహ్నము అన్నదానము జరుపబడును. కావున భక్తులు ఈ పూజలో పాల్గొని అయ్యప్పకు ప్రీతి పాత్రులు కాగలరు.


21 ఎప్రిల్ 2011 - 29 ఎప్రిల్ 2011 - బ్రహ్మోత్సవము మరియు సహస్ర కలశాభిషేకం


21 ఎప్రిల్ 2011 నుండి 29 ఎప్రిల్ 2011 వరకు బ్రహ్మోత్సవము మరియు సహస్ర కలశాభిషేకము నిర్వహించబడినది. అయ్యప్ప ఉత్సవ విగ్రహమను తొమ్మిది రోజులు ఊరేగిస్తారు. మరియు వేయి (సహస్ర) కలశలలో పవిత్ర నీరు ఉంచి, పూజలు నిర్వహించి అయ్యప్ప విగ్రహమునకు అభిషేకం జరుపబడును. ఆ పుణ్యమూర్తిని దర్శించి, ఆ పవిత్రమైన అభిషేక నీటిని స్వీకరించగలరని మా ప్రార్ధన.


27 జనవరి 2011 - 04 ఫిబ్రవరి 2011 - ద్వితీయ అష్టబంధ మహా కుంభాభిషేకం


27 జనవరి నుండి 04 ఫిబ్రవరి 2012 వరకు ద్వితీయ అష్టబంధ మహా కుంభాభిషేకం మరియు కలశ ప్రతిష్ఠ జరుపబడినది. " కుంభం" అనగా "కలశం" లేక " కుండ". ఇది 12 (పుష్కరం) సంవత్సరములకొక్కసారి జరుపబడుతుంది. 9 రోజులు నిత్యం పూజలు నిర్వహించి, అయ్యప్ప విగ్రహానికి అభిషేకాలు చేసి, గోపురనికి నూతన కలశ ప్రతిష్ఠ చేయబడును. కావున భక్తులు ఈ కర్యక్రములలో పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులుకాగలరు. (click here for photos)


13 జనవరి 2006 - లక్ష రుద్రాభిషేకం


మహాదేవుడైన పరమేశ్వరుని కన్నుల (అక్షముల) నుండి రాలిన నీటి బింధువులు భూమిపైన రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించినాయి. కనుక రుద్రాక్షలను సాక్షాత్ శివ స్వరూపంగా భవించి భక్తులు ధరిస్తారు. అభిషేక ప్రియుడు, ఆనంద చిత్తనుడు అయిన అయ్యప్పకు "లక్ష రుద్రాక్షలతో" అభిషేకం జరపబడును. ఈ రుద్రాక్షలు కాశి నుంచి కొనుగోలు చేయబడినవి. అభిషేకం జరిగిన పిమ్మట భక్తులు ఆ రుద్రాక్షలను కొనుగోలు చేసుకొని ఆ దివ్యస్వరూపుని కృపకు పాత్రులుకాగలరు. మొట్టమొదటి సారిగా ఖమ్మం జిల్లాలో జరుపబడిన కార్యక్రమము ఈ "లక్ష రుద్రాభిషేకం".


1999 - ప్రథమ మహా కుంభాభిషేకం


"కుంభ" అనగా "శిఖరం" లేక "గోపురం". అత్యంత భక్తితో, మడితో కలశాలకు పూజలు నిర్వహించి, ఆ కలశాలలో ఉన్న పవిత్ర జలాలతో వేద మంత్రాలు చదువుతూ గోపురానికి అభిషేకం చేస్తారు. ఇది 12 సంవత్సరములకొక్కసారి జరుపబడుతుంది.


1992 - ప్రథమ అష్టబంధ కలశాభిషేకం


"అష్ట" అంటే ఎనిమిది(8). బంధనము అనగా "జతపరచటం". ఎనిమిది నిర్దిష్ట మూలికలతో తయారుచేయబడిన లోహంతో విగ్రహమును మరియు పీఠమును జతపరచటమును "అష్ఠబంధనము" అని అంటారు. జతపరచిన పిమ్మట విగ్రహమునకు పాలు, నీరు, పెరుగు, తేనే, చందనం, విబూది, నెయ్యి, మరియు కొబ్బరి నీళ్ళతో ఆధ్యాత్మిక పద్ధతిలో వేదమంత్రాల మధ్య అభిషేకం జరుపబడును. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.


భక్తవిలోచననే శరణమయ్యప్ప !

సద్గుణ మూర్తియే శరణమయ్యప్ప !!

సర్వమంగళ దాయకనే శరణమయ్యప్ప !!!