This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!
పండగలు ఒక మంచి కారణానికై ఆనందంతో జరుపుకునే ఉత్సవాలు. పండగలు సనాతన సంప్రదాయాలకు ప్రాణం పోస్తూ, అందరికీ మహోత్సవమొనరించవలెననిఆనందాన్నిస్తాయి. పండగల వలన కొన్ని కార్యసాధక ప్రయోజనాలు కలుగుతాయి.

పండగలు మానవ జీవన సరళిలో చారిత్రకంగా, మతపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, నైతికంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతే కాక పండగలు మన దినచర్య నుంచి విచ్ఛిన్నమయ్యేందుకు సహాయపడతాయి.

జాతీయస్థాయిలో పండగలు సమాజంలో సంఘీభావాన్ని మరియు దేశభక్తిని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగలు వివిధ దేశాలలో ఉన్న అన్ని రకాల మతాల వారిని ఒక్కటి చేస్తాయి.
 • పండగలు - 2012
 • పండగలు - 2013
 • 2012 January 14(గురువారం) & 15(శుక్రవారం) & 16(శనివారం) - భోగి & మకర సంక్రాంతి & కనుమ

  2012 పుష్యమాసం లేక ధనుర్మాసం 14(గురువారం) & 15(శుక్రవారం) & 16(శనివారం) - భోగి & మకర సంక్రాంతి & కనుమ

  "సంక్రాంతి" అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
  జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. దీన్ని పెద్ద పండగ అంటారు.
  "ఉత్తరాయణ పుణ్యకాలం" - ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్ఠమైనదని చెప్పబడినది. ఉత్తరాయణ కాలమందు చేయు దానాలలో ఉత్తమమయినవి - ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెఱకు మొదలయినవి. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు.
  పండగ ప్రత్యేకతలు: రథం ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, భోగిపళ్ళు, తిల తర్పణం, హరిదాసులు, గంగిరెద్దులు.

 • 2012 January 28(శనివారం) వసంత పంచమి / సరస్వతి పూజ

  2012 పుష్యమాసం లేక ధనుర్మాసం 28(శనివారం) వసంత పంచమి / సరస్వతి పూజ.

  వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి ఉత్సవం చేయవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నమ్మకం. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును.

 • 2012 February 20(సోమవారం) మహా శివరాత్రి

  2012 మాఘమాసం 20న మహా శివరాత్రి.

  పండగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఈ రోజే శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.
  ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలొనర్చి, ఉపవాసం ఉండి రాత్రి అంతయు జాగరణము చేసి మరునాడు భోజనం చేయుదురు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుదురు. అన్ని శివక్షేత్రము లందు ఈ ఉత్సవము గొప్పగా జరుగును.
  "ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.
  పండగ ప్రత్యేకతలు: జాగరణము, రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, శివసహస్రనామస్తోత్రం.

 • 2012 March 08(గురువారం) హోళి

  2012 పాల్గుణమాసం 08 (గురువారం) హోళి.

  హోళి అనేది రంగుల పండగ. హోళి ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా పండగ జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోళిక దహన్ (హోళికను కాల్చడం) లేదా చోటీ హోళి (చిన్న హోళి) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోళిక విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు తప్పించుకుంటాడు కానీ హోళిక ఈ మంటలలో దహనమయ్యింది. అందుకే భోగి మంటలు అంటిస్తారు.

 • 2012 March 23(శుక్రవారం) ఉగాది (శ్రీ నందన నామ సంవత్సరం)

  2012 ఫాల్గుణమాసం 23 (శుక్రవారం) ఉగాది (శ్రీ నందన నామ సంవత్సరం)

  ఉగాది, తెలుగువారు జరుపుకునే పండగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు.

  "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి మొదలు (ఆది), అనగా సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
  చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు.

  ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

 • 2012 April 01(ఆదివారం) శ్రీరామ నవమి

  2012 చైత్రమాసం 01(ఆదివారం) శ్రీరామ నవమి.

  శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలోజన్మించినాడు.
  ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండగగా జరుపుకుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

 • 2012 April 24(మంగళవారం) అక్షయ తృతీయ

  2012 చైత్రమాసం 24(మంగళవారం) అక్షయ తృతీయ.

  సంస్కృతంలో 'అక్షయ’ అనగా ఎప్పుడు తరగనిదని అర్థం.
  అక్షయ తృతీయ అందరికి అదృష్టం తీసుకుని వస్తుందని నమ్ముతారు. ఈ రోజు కొత్త కార్యక్రమాలు ప్రారంభ కోసం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎటువంటి క్రొత్త పనులనైన, కార్యక్రమాలనైన మొదలు పెట్టిన వారికి తప్పక విజయం చేకూరుతుందని అందరు నమ్ముతారు.
  అక్షయ తృతీయ నవన్న పర్వం అని కూడా పిలుస్తారు. రోహిణి నక్షత్రం నాడు సోమవారం వచ్చే అక్షయ తృతీయ మరింత పవిత్రమైనదిగా భావిస్తారు.

 • 2012 April 26(గురువారం) శ్రీ ఆదిశంకరాచార్య జయంతి

  2012 చైత్రమాసం 26(గురువారం) శ్రీ ఆదిశంకరాచార్య జయంతి.

  శ్రీ ఆది శంకరాచార్యులు, ప్రస్థాంత్రయి (సనాతన ధర్మ యొక్క ప్రముఖ పాఠం - ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు మరియు భగవద్గీత) పై వ్యాఖ్యానం వ్రాసిన వారిలో మొదటి వారు. శంకరాచార్యులు అధ్వైత వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసారు.
  శంకరుడు శంకరాచార్యమను సాంప్రదాయన్ని స్థాపించారు. ఆ సాంప్రదాయాన్ని మొదటిగా పాటించటం వలన శంకరుడిని 'ఆది శంకర ' అని పిలిచెదరు.
  హిందూమతం (సనాతన ధర్మం) లో, శ్రీ మాధవాచార్యులు (ధ్వైత వేదాంతం), శ్రీ రామనుజాచార్యులు (విశిష్టద్వైత వేదాంతం), శ్రీ వల్లభాచార్యులు (శుద్ధ అద్వైత వేదాంతం) వంటి ప్రత్యేక ఆచార్యుల సంప్రదాయం ఉంది. వారు కేవలం సాధారణ ఉపాధ్యాయులు కారు, గొప్ప తత్వవేత్తలు.
  ఆది శంకరాచార్యులు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు.
  వైశాఖ శుద్ధ పంచమి నాడు కేరళ లోని "కాలడి" గ్రామమునందు శ్రీ ఆది శంకరాచార్యులవారు జనియించారు. కనుక ప్రతి సంవత్సరం అదే రొజును శ్రీ ఆది శంకరాచార్య జయంతి గా పండగ జరుపుకుంటారు.

 • 2012 May 15(మంగళవారం) హనుమాన్ జయంతి

  2012 వైశాఖమాసం 15(మంగళవారం) హనుమాన్ జయంతి.

  హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు.
  హనుమాన్ జయంతి విస్తృతంగా భారతదేశం అంతటా వానర దేవుడైన హనుమంతుని పుట్టిన రోజుగా జరుపుకుంటారు. ఇది చైత్ర పౌర్ణిమ అనగా చైత్ర మాసం నందు, శుక్ల పక్ష యొక్క 15 వ రోజున జరుపుకుంటారు. హనుమంతుడు బలం మరియు శక్తి యొక్క చిహ్నం.
  హనుమంతుడుని ముల్లోకాల్లో అతి బలవంతుణిగా పరిగణించారు. పసికందుగా ఉన్న హనుమంతుడుని ముల్లోకముల దేవతలు చిరంజీవిగా దీవించారు.
  హనుమంతుడు మాయా అధికారాలు మరియు చెడు ఆత్మలు జయించేందుకు జనియించిన ఒక దేవుడిగా జానపద సంప్రదాయంలో పూజిస్తుంటారు.
  హనుమంతుడు తెల్లవారుఝామున జన్మించిన కారణంగా, హనుమత్ జయంతి నాడు ప్రతి దేవాలయమునందు సాయంకాల సమయం నుండి తెల్లవారుఝాము వరకు పూజలు నిర్వహించబడతాయి. తెల్లవారిన తరువాత భక్తులందరికి పూజాప్రసాదము పంచటం జరుగుతుంది.

 • 2012 June 21(గురువారం) పూరీ జగన్నాథ స్వామి రథోత్సవము

  2012 జేష్ఠమాసం 21(గురువారం) పూరీ జగన్నాథ స్వామి రథోత్సవము.

  ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర.
  ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు.
  రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు.
  ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

 • 2012 July 03(మంగళవారం) గురుపౌర్ణమి

  2012 ఆషాఢమాసం 03(మంగళవారం) గురుపౌర్ణమి.

  ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.
  గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు.
  హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
  ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

 • 2012 July 27(శుక్రవారం) వరలక్ష్మీ వ్రతము

  2012 ఆషాఢమాసం 27(శుక్రవారం) వరలక్ష్మీ వ్రతము.

  వరలక్ష్మీ వ్రతము శ్రావణ మాసములో మహిళలు జరుపుకునే అతి ముఖ్యమైన పండగ. ప్రతి సంవత్సరం శ్రావణ మాసములో వచ్చే శ్రావణ పూర్ణిమ ముందు శుక్రవారము స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకుంటారు.
  శ్రావణ మాసములో శ్రావణ నక్షత్రమున విష్ణువు జనియించుట వలన శ్రావణ మాసము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి అని భావిస్తారు. అదియేకాక, లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సునొసగె దేవత అయినందువలన, ఈ వరలక్ష్మీ పూజను పాటించినవారికి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకము.

 • 2012 August 02(గురువారం) రాఖీ పౌర్ణమి

  2012 శ్రావణమాసం 02(గురువారం) రాఖీ పౌర్ణమి.

  రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
  రాఖీ అనగా రక్షణ బంధం.
  ఇది అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు.
  అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండగ ప్రధాన విశేషం.

 • 2012 August 10(శుక్రవారం) గోకులాష్టమి / శ్రీకృష్ణ జయంతి

  2012 శ్రావణమాసం 10(శుక్రవారం) గోకులాష్టమి / శ్రీకృష్ణ జయంతి.

  కృష్ణ జన్మాష్టమి అనగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము అయిన శ్రీకృష్ణుడి జన్మదినము.
  శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణమాస కృష్ణ పక్ష అష్టమి తిధి రోజున కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
  కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇది.

 • 2012 Septmeber 19(బుధవారం) వినాయక చవితి

  2012 భాద్రపదమాసం 19(బుధవారం) వినాయక చవితి.

  వినాయక చవితి పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టున రోజు. వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.
  వినాయక చవితి భాద్రపద శుక్ల పక్ష తర్వాత నాల్గవ రోజు (చతుర్దశి)న వస్తుంది.
  వినాయక చవితి 9 నుండి 11 రోజులు జరుపుకుని చివరి రోజు అయిన అనంత చతుర్దశి నాడు విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

 • 2012 October 16(మంగళవారం) దేవీ నవరాత్రులు ప్రారంభం

  2012 అశ్వయుజమాసం 16(మంగళవారం) దేవీ నవరాత్రులు ప్రారంభం.

  నవరాత్రి ఉత్సవాల సమయంలో పార్వతీదేవికి ప్రతి రోజు ఒక అలంకరణ చేస్తారు.
  కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు.

 • 2012 October 22(సోమవారం) దుర్గా పూజ

  2012 అశ్వయుజమాసం 22(సోమవారం) దుర్గా పూజ.

  ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ.
  కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.
  ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు.

 • 2012 October 23(మంగళవారం) మహర్నవమి

  2012 అశ్వయుజమాసం 23(మంగళవారం) మహర్నవమి.

  మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.

 • 2012 October 24(బుధవారం) విజయదశమి / దసరా

  2012 అశ్వయుజమాసం 24(బుధవారం) విజయదశమి / దసరా.

  దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరాఅంటారు. ఈ పండగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనుక ఈ పేరు వచ్చింది.
  కొందరు ఈ పండగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.
  విజయదశమి రోజున పురాణేతిహాసాల ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం ముగిస్తూ జమ్మి చెట్టు పైనున్న తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు.
  జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.

 • 2012 November 12(సోమవారం) నరక చతుర్దశి

  2012 అశ్వయుజమాసం 12(సోమవారం) నరక చతుర్దశి.

  శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన కారణంగా ప్రజలు నరకచతుర్దశి పండగను జరుపుకుంటారు.
  భూదేవి శ్రీమహావిష్ణువుని మహా యోధుని కుమారుడిగా ప్రసాదించమని కోరగా నరకాసురుడిని వరంగా ప్రసాదించారు.
  నరకాసురుడు(నరకుడు) ప్రాగ్జ్యోతిష్యపురమును (ఇప్పుడు అస్సాం) పాలించేవాడు. ముల్లోకములను అతని వికృత చేష్టలతో దేవతలను, ఋషులను, ప్రజలను, పశు పక్షాదులని బాధలు పెట్టేవాడు. దేవతల కోరిక మేరకు శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాడు.

 • 2012 November 13(మంగళవారం) దీపావళి / లక్ష్మీదేవి పూజ

  2012 అశ్వయుజమాసం 13(మంగళవారం) దీపావళి / లక్ష్మీదేవి పూజ.

  ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండగే దివ్య దీప్తులదీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.
  నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
  చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండగను జరుపుకుంటారు. ఈ పండగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది.

 • 2012 November 17(శనివారం) నాగుల చవితి

  2012 కార్తీకమాసం 17(శనివారం) నాగుల చవితి.

  దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.
  నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
  నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు.
  శ్రీ కృష్ణ భగవానుడు కాళియ నాగుని దుష్టచర్యలను ముగించి అతనిపై గెలుపు సాధించినందున నాగ పంచమి జరుపుకుంటారని ప్రతీతి.

 • 2012 November 28(బుధవారం) కార్తీక పౌర్ణమి

  2012 కార్తీకమాసం 28(బుధవారం) కార్తీక పౌర్ణమి.

  కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
  ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది.
  కార్తీక పౌర్ణమి శివుడికి మరియు విష్ణువుకి అతి ముఖ్యమైన, పవిత్రమైన, శక్తివంతమైన, ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.

 • 2012 December 23(ఆదివారం) వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి

  2012 మార్గశిరమాసం 23(ఆదివారం) వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.

  ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
  ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహానాదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
  ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు.
  వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
  సాధారణముగా దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకొంటారు.

 • 2013 January 13(ఆదివారం) & 14(సోమవారం) & 15(మంగళవారం) - భోగి & మకర సంక్రాంతి & కనుమ

  2013 పుష్యమాసం లేక ధనుర్మాసం 13(ఆదివారం) & 14(సోమవారం) & 15(మంగళవారం) - భోగి & మకర సంక్రాంతి & కనుమ

  "సంక్రాంతి" అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
  జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. దీన్ని పెద్ద పండగ అంటారు.
  "ఉత్తరాయణ పుణ్యకాలం" - ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్ఠమైనదని చెప్పబడినది. ఉత్తరాయణ కాలమందు చేయు దానాలలో ఉత్తమమయినవి - ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెఱకు మొదలయినవి. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు.
  పండగ ప్రత్యేకతలు: రథం ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, భోగిపళ్ళు, తిల తర్పణం, హరిదాసులు, గంగిరెద్దులు.

 • 2013 February 15(శుక్రవారం) వసంత పంచమి / సరస్వతి పూజ

  2013 పుష్యమాసం లేక ధనుర్మాసం 15(శుక్రవారం) వసంత పంచమి / సరస్వతి పూజ

  వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి ఉత్సవం చేయవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నమ్మకం. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును.

 • 2013 March 10(ఆదివారం) మహా శివరాత్రి

  2013 మాఘమాసం 10(ఆదివారం) మహా శివరాత్రి

  పండగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఈ రోజే శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.
  ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలొనర్చి, ఉపవాసం ఉండి రాత్రి అంతయు జాగరణము చేసి మరునాడు భోజనం చేయుదురు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుదురు. అన్ని శివక్షేత్రము లందు ఈ ఉత్సవము గొప్పగా జరుగును.
  "ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.
  పండగ ప్రత్యేకతలు: జాగరణము, రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, శివసహస్రనామస్తోత్రం.

 • 2013 March 27(బుధవారం) హోళి

  2013 పాల్గుణమాసం 27(బుధవారం) హోళి

  హోళి అనేది రంగుల పండగ. హోళి ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా పండగ జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోళిక దహన్ (హోళికను కాల్చడం) లేదా చోటీ హోళి (చిన్న హోళి) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోళిక విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు తప్పించుకుంటాడు కానీ హోళిక ఈ మంటలలో దహనమయ్యింది. అందుకే భోగి మంటలు అంటిస్తారు.

 • 2013 April 11(గురువారం) ఉగాది (శ్రీ విజయనామ సంవత్సరం)

  2013 ఫాల్గుణమాసం 11(గురువారం) ఉగాది (శ్రీ విజయనామ సంవత్సరం)

  ఉగాది, తెలుగువారు జరుపుకునే పండగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు.

  "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి మొదలు (ఆది), అనగా సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
  చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు.

  ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

 • 2013 April 20(శనివారం) శ్రీరామ నవమి

  2013 చైత్రమాసం 20(శనివారం) శ్రీరామ నవమి

  శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలోజన్మించినాడు.
  ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండగగా జరుపుకుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

 • 2013 April 25(గురువారం) హనుమాన్ జయంతి

  2013 చైత్రమాసం 25(గురువారం) హనుమాన్ జయంతి.

  హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు.
  హనుమాన్ జయంతి విస్తృతంగా భారతదేశం అంతటా వానర దేవుడైన హనుమంతుని పుట్టిన రోజుగా జరుపుకుంటారు. ఇది చైత్ర పౌర్ణిమ అనగా చైత్ర మాసం నందు, శుక్ల పక్ష యొక్క 15 వ రోజున జరుపుకుంటారు. హనుమంతుడు బలం మరియు శక్తి యొక్క చిహ్నం.
  హనుమంతుడుని ముల్లోకాల్లో అతి బలవంతుణిగా పరిగణించారు. పసికందుగా ఉన్న హనుమంతుడుని ముల్లోకముల దేవతలు చిరంజీవిగా దీవించారు.
  హనుమంతుడు మాయా అధికారాలు మరియు చెడు ఆత్మలు జయించేందుకు జనియించిన ఒక దేవుడిగా జానపద సంప్రదాయంలో పూజిస్తుంటారు.
  హనుమంతుడు తెల్లవారుఝామున జన్మించిన కారణంగా, హనుమత్ జయంతి నాడు ప్రతి దేవాలయమునందు సాయంకాల సమయం నుండి తెల్లవారుఝాము వరకు పూజలు నిర్వహించబడతాయి. తెల్లవారిన తరువాత భక్తులందరికి పూజాప్రసాదము పంచటం జరుగుతుంది.

 • 2013 May 13(సోమవారం) అక్షయ తృతీయ

  2013 చైత్రమాసం 13(సోమవారం) అక్షయ తృతీయ

  సంస్కృతంలో 'అక్షయ’ అనగా ఎప్పుడు తరగనిదని అర్థం.
  అక్షయ తృతీయ అందరికి అదృష్టం తీసుకుని వస్తుందని నమ్ముతారు. ఈ రోజు కొత్త కార్యక్రమాలు ప్రారంభ కోసం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎటువంటి క్రొత్త పనులనైన, కార్యక్రమాలనైన మొదలు పెట్టిన వారికి తప్పక విజయం చేకూరుతుందని అందరు నమ్ముతారు.
  అక్షయ తృతీయ నవన్న పర్వం అని కూడా పిలుస్తారు. రోహిణి నక్షత్రం నాడు సోమవారం వచ్చే అక్షయ తృతీయ మరింత పవిత్రమైనదిగా భావిస్తారు.

 • 2013 May 15(బుధవారం) శ్రీ ఆదిశంకరాచార్య జయంతి

  2013 చైత్రమాసం 15(బుధవారం) శ్రీ ఆదిశంకరాచార్య జయంతి

  శ్రీ ఆది శంకరాచార్యులు, ప్రస్థాంత్రయి (సనాతన ధర్మ యొక్క ప్రముఖ పాఠం - ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు మరియు భగవద్గీత) పై వ్యాఖ్యానం వ్రాసిన వారిలో మొదటి వారు. శంకరాచార్యులు అధ్వైత వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసారు.
  శంకరుడు శంకరాచార్యమను సాంప్రదాయన్ని స్థాపించారు. ఆ సాంప్రదాయాన్ని మొదటిగా పాటించటం వలన శంకరుడిని 'ఆది శంకర ' అని పిలిచెదరు.
  హిందూమతం (సనాతన ధర్మం) లో, శ్రీ మాధవాచార్యులు (ధ్వైత వేదాంతం), శ్రీ రామనుజాచార్యులు (విశిష్టద్వైత వేదాంతం), శ్రీ వల్లభాచార్యులు (శుద్ధ అద్వైత వేదాంతం) వంటి ప్రత్యేక ఆచార్యుల సంప్రదాయం ఉంది. వారు కేవలం సాధారణ ఉపాధ్యాయులు కారు, గొప్ప తత్వవేత్తలు.
  ఆది శంకరాచార్యులు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు.
  వైశాఖ శుద్ధ పంచమి నాడు కేరళ లోని "కాలడి" గ్రామమునందు శ్రీ ఆది శంకరాచార్యులవారు జనియించారు. కనుక ప్రతి సంవత్సరం అదే రొజును శ్రీ ఆది శంకరాచార్య జయంతి గా పండగ జరుపుకుంటారు.

 • 2013 July 10(బుధవారం) పూరీ జగన్నాథ స్వామి రథోత్సవము

  2013 జేష్ఠమాసం 10(బుధవారం) పూరీ జగన్నాథ స్వామి రథోత్సవము

  ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర.
  ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు.
  రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు.
  ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

 • 2013 July 22(సోమవారం) గురుపౌర్ణమి

  2013 ఆషాఢమాసం 22(సోమవారం) గురుపౌర్ణమి

  ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.
  గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు.
  హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
  ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

 • 2013 August 16(శుక్రవారం) వరలక్ష్మీ వ్రతము

  2013 ఆషాఢమాసం 16(శుక్రవారం) వరలక్ష్మీ వ్రతము

  వరలక్ష్మీ వ్రతము శ్రావణ మాసములో మహిళలు జరుపుకునే అతి ముఖ్యమైన పండగ. ప్రతి సంవత్సరం శ్రావణ మాసములో వచ్చే శ్రావణ పూర్ణిమ ముందు శుక్రవారము స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకుంటారు.
  శ్రావణ మాసములో శ్రావణ నక్షత్రమున విష్ణువు జనియించుట వలన శ్రావణ మాసము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి అని భావిస్తారు. అదియేకాక, లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సునొసగె దేవత అయినందువలన, ఈ వరలక్ష్మీ పూజను పాటించినవారికి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకము.

 • 2013 August 20(మంగళవారం) రాఖీ పౌర్ణమి

  2013 శ్రావణమాసం 20(మంగళవారం) రాఖీ పౌర్ణమి

  రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
  రాఖీ అనగా రక్షణ బంధం.
  ఇది అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు.
  అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండగ ప్రధాన విశేషం.

 • 2013 August 28(బుధవారం) గోకులాష్టమి / శ్రీకృష్ణ జయంతి

  2013 శ్రావణమాసం 28(బుధవారం) గోకులాష్టమి / శ్రీకృష్ణ జయంతి

  కృష్ణ జన్మాష్టమి అనగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము అయిన శ్రీకృష్ణుడి జన్మదినము.
  శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణమాస కృష్ణ పక్ష అష్టమి తిధి రోజున కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
  కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇది.

 • 2013 Septmeber 09(సోమవారం) వినాయక చవితి

  2013 భాద్రపదమాసం 09 (సోమవారం) వినాయక చవితి

  వినాయక చవితి పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టున రోజు. వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.
  వినాయక చవితి భాద్రపద శుక్ల పక్ష తర్వాత నాల్గవ రోజు (చతుర్దశి)న వస్తుంది.
  వినాయక చవితి 9 నుండి 11 రోజులు జరుపుకుని చివరి రోజు అయిన అనంత చతుర్దశి నాడు విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

 • 2013 October 05(శనివారం) దేవీ నవరాత్రులు ప్రారంభం

  2013 అశ్వయుజమాసం 05(శనివారం) దేవీ నవరాత్రులు ప్రారంభం

  నవరాత్రి ఉత్సవాల సమయంలో పార్వతీదేవికి ప్రతి రోజు ఒక అలంకరణ చేస్తారు.
  కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు.

 • 2013 October 11(శుక్రవారం) దుర్గా పూజ

  2013 అశ్వయుజమాసం 11(శుక్రవారం) దుర్గా పూజ

  ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ.
  కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.
  ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు.

 • 2013 October 12(శనివారం) మహర్నవమి

  2013 అశ్వయుజమాసం 12(శనివారం) మహర్నవమి

  మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.

 • 2013 October 14(సోమవారం) విజయదశమి / దసరా

  2013 అశ్వయుజమాసం 14(సోమవారం) విజయదశమి / దసరా

  దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరాఅంటారు. ఈ పండగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనుక ఈ పేరు వచ్చింది.
  కొందరు ఈ పండగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.
  విజయదశమి రోజున పురాణేతిహాసాల ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం ముగిస్తూ జమ్మి చెట్టు పైనున్న తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు.
  జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.

 • 2013 November 02(శనివారం) నరక చతుర్దశి

  2013 అశ్వయుజమాసం 02(శనివారం) నరక చతుర్దశి

  శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన కారణంగా ప్రజలు నరకచతుర్దశి పండగను జరుపుకుంటారు.
  భూదేవి శ్రీమహావిష్ణువుని మహా యోధుని కుమారుడిగా ప్రసాదించమని కోరగా నరకాసురుడిని వరంగా ప్రసాదించారు.
  నరకాసురుడు(నరకుడు) ప్రాగ్జ్యోతిష్యపురమును (ఇప్పుడు అస్సాం) పాలించేవాడు. ముల్లోకములను అతని వికృత చేష్టలతో దేవతలను, ఋషులను, ప్రజలను, పశు పక్షాదులని బాధలు పెట్టేవాడు. దేవతల కోరిక మేరకు శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాడు.

 • 2013 November 03(ఆదివారం) దీపావళి / లక్ష్మీదేవి పూజ

  2013 అశ్వయుజమాసం 03(ఆదివారం) దీపావళి / లక్ష్మీదేవి పూజ

  ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండగే దివ్య దీప్తులదీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.
  నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
  చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండగను జరుపుకుంటారు. ఈ పండగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది.

 • 2013 November 07(గురువారం) నాగుల చవితి

  2013 కార్తీకమాసం 07(గురువారం) నాగుల చవితి

  దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.
  నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
  నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు.
  శ్రీ కృష్ణ భగవానుడు కాళియ నాగుని దుష్టచర్యలను ముగించి అతనిపై గెలుపు సాధించినందున నాగ పంచమి జరుపుకుంటారని ప్రతీతి.

 • 2013 November 17(ఆదివారం) కార్తీక పౌర్ణమి

  2013 కార్తీకమాసం 17(ఆదివారం) కార్తీక పౌర్ణమి

  కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
  ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది.
  కార్తీక పౌర్ణమి శివుడికి మరియు విష్ణువుకి అతి ముఖ్యమైన, పవిత్రమైన, శక్తివంతమైన, ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.

 • 2013 - ఈ యేడు వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి పండగ లేదు

  2013 మార్గశిరమాసం NO FESTIVAL వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.

  ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
  ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహానాదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
  ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు.
  వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
  సాధారణముగా దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకొంటారు.

షణ్ముఖ సోదరనే శరణమయ్యప్ప !

యెంగళ్ కులదైవమే శరణమయ్యప్ప !!

స్వామియిన్ పుంగావేమే శరణమయ్యప్ప !!!

Comment