This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!
  • అవిద్య - 18వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "జ్ఞానమంజరీదేవి". ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం, ఆర్ధిక స్థిరత్వం కలుగుతాయి.

    విద్య లేకపొవటమే అవిద్య. విద్య లేని వాడు వింత పశువు.

  • విద్య - 17వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "అనంతాదేవి". ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి.

    అభ్యాసం లేదా అధ్యయనం ద్వార సాధించే ఆధ్యాత్మిక అవలంబనే విద్య.

  • రాజసం - 16వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "పరాదేవి". ఈ మెట్టు స్పర్శ వలన దేహసుఖం, బలం లభిస్తాయి.

    రాజసం యొక్క దశ. చర్య, అభిమానం, సృష్టి, దుడుకు, చురుకు మొదలైన లక్షణములు కలిగి ఉండటం.

  • తామసం - 15వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "వేదత్రయూ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఆహారశుద్ధి, మోక్షం,కలుగుతాయి.

    అతి నిద్ర , చాలా సోమరి, చీకటి, అజ్ఞానం, మందగతి, విధ్వంసం, భారము, వ్యాధి, మొదలైన లక్షణములు కలిగి ఉంటుంది.

  • సత్వం - 14వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "భయనాశినీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీహత్యాపాతకాలు నశిస్తాయి.

    స్వచ్ఛత, ప్రశాంతత, ఆనందం, శక్తి, మంచితనం యొక్క నాణ్యత. కొన్నిసార్లు మంచితనం గా అనువదించబడిన సాత్వ యొక్క దశ తేలిక, శాంతి, పరిశుభ్రత, జ్ఞానం, మొదలైన లక్షణములు కలిగి ఉంటుంది.

  • స్పర్శ - 13వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "భవఘ్నీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార, మద్య, మాంసభక్షణ, పాపాలు నశిస్తాయి.

    స్వామి పాదములను స్పర్శించుటకు ఉపయోగపడే ఇంద్రియమే స్పర్శ.

  • జిహ్వ - 12వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "చిదానందా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఇష్టదేవతా దర్శనము లభిస్తుంది. దీనిని కఠొరంగా మాట్లాడుటకు ఉపయోగించకూడధు.

    షడ్రుచులను తెలిపే ఇంద్రియమే జిహ్వ (నాలుక). ఈ ఇంద్రియంతోనే స్వామిని కీర్తనలతో, నామాలతో స్మరించి ఆ రుచిని కూడా పొందాలి.

  • నాసిక - 11వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "అర్ధమాత్రా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన అకాలమృత్యుభయం ఉండదు.

    వాసనను గ్రహించే ఇంద్రియమే నాసికం.

  • చెవులు - 10వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "ముక్తిగేహినే దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమధర్మ పుణ్యఫలం, జ్ఞానం కలుగుతుంది. ఇవి మంచిని వినుటకు మాత్రమే ఉపయోగించవలెను.

    స్వామి కీర్తనలను, నామాలను వినుటకు ఉపయోగపడే ఇంద్రియమే చెవులు.

  • నేత్రములు - 9వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "త్రిసంధ్యా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగాతీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది.

    దేవుడు సృష్ఠించిన ఈ లోకాన్ని చూడడానికి ఉపయోగపడే ఇంద్రియమే నేత్రములు (నయనాలు లేక అక్షులు) “సర్వేంద్రియానం నయనం ప్రధానం”

  • అహంకారం - 8వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "బ్రహ్మవల్లీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి.

    నాకు మాత్రమే తెలుసు లేక నేనే గొప్ప అనుకునే బుద్ది.

  • దంబం - 7వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "బ్రహ్మవిద్యా దేవి". ఈ మెట్టు స్పర్శల వలన విజ్ఞానయోగాధ్యాయం కలిగి పునర్జన్మ కల్గదు.

  • మాత్స్యర్యం - 6వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "సరస్వాతీ దేవి". ఈ మెట్టు స్పర్శల వలన విష్ణుసాయుజ్యం, సమస్త ధాన ఫలం కలుగుతుంది.

    ఇతరుల సంతోషాన్ని కాని ఆనందాన్ని ఒర్వలేని బుద్ది

  • మదం - 5వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "సత్యవతీ మాత". ఈ మెట్టు కర్మసన్యాసయోగానికి ప్రతీక. 4 & 5 మెట్లు స్పర్శించిన గృహములో ఉన్న పశు-పక్ష్యాదులకు సైతం పాపాలు నశించి, ఉత్తమగతులు కలుగుతాయి.

    తాను అనుకున్న లేక నమ్మిన దానినే ఉత్తమమైనదిగా భావించే మనసత్వం.

  • మోహం - 4వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "సీతా దేవి". ఈ మెట్టు జ్ఞానయోగానికి ప్రతీక.

    ఒక పరిస్థితిని లేక నమ్మకమైన ఒక కారణం, ప్రత్యేకించి ఒక వ్యక్తి పై ప్రేమ /అనుబందం భావన.

  • లోభం - 3వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "గాయత్రీ మాత". ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమగతులు కలుగుతాయి.

    అవసరాలకంటే ఎక్కువ కావలనుకునే బుద్ది. కీర్తి కోసం అత్యాశ, తీవ్రమైన మరియు స్వార్థపూరిత కోరిక. దురాశ దుఖాఃనికి చేటు.

  • క్రోధం - 2వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "గంగా దేవి". ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే జ్ఞానం కలుగ్తుంది.

    "తన కోపమే తన శత్రువు". మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం.

  • కామం - 1వ మెట్టు

    ఈ మెట్టుకు అధి దేవత "గీతా మాత".ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వజన్మస్మృతి కలుగుతుంది. గతజన్మలో తాను చేసిన పాపపుణ్యకర్మల విచక్షణాజ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ది పొందుతాడు.

    "లైంగిక కోరికను" సంస్కృతంలో "కామము" అని అంటారు. ఇంకా విస్తృతంగా కోరిక, వాంఛ అని కూడా అంటారు.


18 పరిపూర్ణతలను సాధించిన ఙ్ఞానికి సంకేతం. ఆ ఙ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం.

ఈ 18 మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మెట్లు పంచలోహముల (బంగారు, వెండి, రాగి, ఇనుము మరియు తగరం యొక్క ఒక ప్రత్యేక మిశ్రమం) పూతతో కప్పబడి ఉంటాయి.

41 రోజులు (మండలం) అయ్యప్ప దీక్షచేసిన వారు మాత్రమే పదునెట్టాంబడి ఎక్కుటకు అర్హులు. ఇది శబరిగిరీశుడు అయ్యప్ప నడిచిన దారి. అందుకే అత్యంత పవిత్రమైనది. ఎవరైతే పదునెట్టాంబడిని 18 సార్లు ఎక్కుతారో వాళ్ళు శబరిమలలో ఒక కొబ్బరి మొక్కని నాటుతారు.

మొదటి 8 మెట్లు - అరిషడ్వర్గములను(6) మరియు రాగములను (2) సూచిస్తాయి  - కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దంబం, అహంకారం.

తదుపరి 5 మెట్లు పంచేంద్రియములను సూచిస్తాయి  - నేత్రములు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శ.

తదుపరి 3 మెట్లు మూడు గుణములను సూచిస్తాయి  - సత్వం, తామసం, రాజసం.

చివరి 2 మెట్లు  - విద్య, అవిద్యలను సూచిస్తాయి.

- హిందూ వేదాంతం ప్రకారము '18' వ అంకెకు గొప్ప గుర్తింపు ఉంది. అయ్యప్ప 18 ఆయుధాలతో చెడును నిర్మూలిస్తాడు. ఆ 18 మెట్లు 18 ఆయుధాలను సూచిస్తాయని చెబుతారు.

- భగవద్గీతలో, మహాభారతంలో, చతుర్వేదాలలో (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము) 18 అధ్యాయాలు ఉన్నాయి.

- 18 పురాణాలు, ఉపపురాణాలు కలవు. మహాభారత యుధ్ధం మరియు రావణ సంహారం 18 దినములు జరిగింది.

- కేరళలోని అయ్యప్ప సన్నిధానం 18 గొప్ప పర్వతాల మధ్యన ఉంటుంది. ఆ 18 పర్వతాలు - పొన్నంబలమేడు, గౌడెన్మల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, ఖల్గిమల, మతంగమల, మ్య్లదుంమల, శ్రీపాదమల, దేవర్మల, నిలక్కలమల, తలప్పరమల, నీలమల, కరిమల, పుదుసేర్య్మల, కలకెట్టిమల, ఇంచిప్పరమల & శబరిమల).


లోకరక్షకనే శరణమయ్యప్ప !

సద్గుణ మూర్తియే శరణమయ్యప్ప !!

పదునెట్టాంబడి అధిపతియే శరణమయ్యప్ప !!!